బిగ్ బాస్ సీజన్ - 6 గీతూ రాయల్ అందరికి తెలిసిందే.. బిగ్ బాస్ లో అందరిని ఒక అట ఆడుకొని ఎవరూ ఉహించని విధంగా బయటకొచ్చింది. "టైటిల్ విన్నర్ అనుకున్న నన్ను ఇలా ఎలిమినేట్ చేస్తారా" అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చిన కొందరు ఆఫర్స్ తో బిజీ కాగా మరికొందరు 'బిబి జోడీ' లో పాల్లొంటూ తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే గీతూ మాత్రం ఖాళీగానే ఉంటుంది.
బిగ్ బాస్ హౌస్ ఇచ్చిన ఫ్రెండ్ ఆదిరెడ్డి అంటూ చెప్తూ ఉండేది. ఆదిరెడ్డి కి సర్ ప్రైజ్ గా తన ఫ్యామిలీని కలిసిన గీతూ.. తనతో చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్ లో షేర్ చేసింది. ఫైమా బయటకొచ్చాక తనని కలిసి వీడియో చేసింది. ఇలా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఒక్కొక్కరిని కలిసి ఆ వీడియోలని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తోంది గీతు.
బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చాక చిన్న చిన్న షోస్ లో మెరిసి కూడా.. ఆమెకున్న ఆటిట్యూడ్ కి ఎక్కువగా ఫ్యాన్ బేస్ సంపాదించుకోలేకపోయింది.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది గీతూ.. అందులో "మనది కానిది మనం తీసుకుంటే.. మనకు వచ్చేది భగవంతుడు రానివ్వడు " అంటూ చెప్పింది. దీంతో ఈ వీడీయోని చూసిన నెటిజన్లు... "అందుకే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాలేదు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు "ఇక ఇలా నీతిసూక్తులు చెప్పుకునే ఉండాలి" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ కి గీతూ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.